AP: వచ్చే వారం రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది వాయుగుండంగా బలపడి రాష్ట్రంవైపు కదిలేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని చెబుతున్నారు. రుతుపవన ద్రోణి ఉత్తర కోస్తాకు సమీపంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సీజన్‌లో అల్పపీడనాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉండనున్నాయి. వీటి ప్రభావంతో సెప్టెంబరు చివరి వారంలో వర్షాలు జోరందుకుంటాయని అంచనా.