17న విశ్వకర్మ పూజా మహోత్సవం

59చూసినవారు
గజపతినగరం మండలం పురిటిపెంట సంత తోట ఆవరణలో గల శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో ఈ నెల 17వ తేదీన విశ్వకర్మ పూజ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు విశ్వకర్మ జిల్లా కార్యదర్శి ఏ గణేష్ ఆదివారం తెలిపారు. పూజ హోమంతో పాటు గాయత్రి విశ్వకర్మ భగవాన్ కళ్యాణ మహోత్సవం జరుగుతుందని చెప్పారు. ఉదయం 6 గంటల నుండి ప్రారంభమవుతుందని భక్తులు కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.

సంబంధిత పోస్ట్