జిల్లాలో గల రౌడీషీటర్ల ప్రవర్తన, నేరచరిత్ర ఆధారంగా విభజన చేసి వారిపై నిఘా పెట్టాలని ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. శుక్రవారం ఆయన కార్యాలయంలో జిల్లాలో గల పోలీస్ అధికారులతో మాసాంతర నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ మేరకు గంజాయి, ఫోక్సో, మిస్సింగ్ తదితర కేసుల పురోగతిని సమీక్షించారు. విధిగా గ్రామ సందర్శనలు చేసి ప్రజలతో మమేకమై నేర చట్టాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.