నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలో గల జరజాపుపేటలో నిర్వహించిన క్లోరినేషన్ పనులను నగర పంచాయతీ కమిషనర్ కే అప్పలరాజు గురువారం పరిశీలించారు. నగర పంచాయతీ ప్రజలకు క్లోరినేషన్ చేసిన తాగునీరును సరఫరా చేయాలని సిబ్బందికి ఆదేశించారు. డయేరియా సోకకుండా ముందస్తు జాగ్రత్తలో భాగంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలను పగడ్బందీగా నిర్వహించాలని కోరారు. ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు.