పార్వతీపురం పట్టణం రాజుగారి కోటలో ఉన్న గాయత్రి స్కూల్ నందు గురువారం కరాస్పాండెంట్ ఫణిబాబు ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు డా. కె. శ్రీరేఖ ముఖ్య అతిధి గా విచ్చేసి జాతీయ జెండా ను ఎగురావేశారు. స్వాతంత్ర్య దినోత్సవ విశిష్టతతో పాటుగా విద్యార్థుల భాద్యతల గురించి ప్రస్తావించారు. అనంతరం విద్యార్థులకు నిర్వహించిన పలు ఆటల పోటీలలో వారికి బహుమతులు ముఖ్య అతిథి చేతులమీదుగా అందచేశారు.