పార్వతీపురం: విధుల్లో అలసత్వం వద్దు: ఎమ్మెల్యే బోనెల

67చూసినవారు
ప్రజలకు సేవలు అందించాల్సిన ఉద్యోగులు విధుల్లో అలసత్వం ప్రదర్శించవద్దని ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు. గురువారం ఎమ్మెల్యే తాసిల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఉద్యోగుల హాజరు రికార్డుల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. విద్యార్థులకు అవసరమైన క్యాస్ట్, ఇన్కమ్ నేటివిటీ తదితర సర్టిఫికెట్లు జారీలో జాప్యం జరుగుతుందని ఎమ్మెల్యే గుర్తించారు. పెండింగ్లో ఉన్న సర్టిఫికెట్లను తక్షణమే చర్యలు చేపట్టాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్