పార్వతీపురం: ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి బైక్ ర్యాలీ

75చూసినవారు
జంఝావతి ప్రాజెక్టును పూర్తి చేయాలని కోరుతూ ఈనెల 12న బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి జిల్లా నాయకులు అల్లు సత్యం చెప్పారు. ఈ సందర్బంగా ఆయన పార్వతీపురంలో ఒక వీడియో విడుదల చేశారు. 12న ఉ. 10 గం. లకు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ర్యాలీ ప్రారంభిస్తామని తెలిపారు. చెరువుల పరిరక్షణ సమితి సభ్యులు, రైతులు హాజరై జయప్రదం చేయాలని కోరారు. పూర్తి చేసే వరకు దశలవారీగా ఆందోళన చేస్తామని చెప్పారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్