AP: పిఠాపురంలో నిర్వహించిన పల్లె పండుగ వారోత్సవాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గర్భిణులకు సీమంతం చేశారు. అనంతరం వారికి అందజేస్తున్న పోషకాహారం గురించి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు భోగి పళ్ల ఉత్సవం నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను పవన్ తిలకించారు.