AP: 'గేమ్ ఛేంజర్', 'డాకు మహారాజ్' సినిమాల టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు సంబంధించి ప్రభుత్వం వివరణ మెమో జారీ చేసింది. సినిమా టికెట్ ధరల పెంపు, అదనపు షోలపై హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం 10 రోజుల పాటు రోజుకు 5 షోలకు మించకుండా ప్రదర్శించాలని తెలిపింది. సరైన పోలీసుల భద్రత లేకుండా థియేటర్లకు వచ్చే జనాన్ని నియంత్రించటం కష్టమని మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.