ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు నిరసన సెగ తగిలింది. తిరుపతిలో నిర్వహించిన వారాహి సభలో ఏఐఎస్ఎఫ్ నాయకులు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ నినాదాలు చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని కోరారు. ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. దీనిపై పవన్ స్పందించాలని కోరారు. అయితే పోలీసులు అక్కడికి చేరుకుని నిరసనకారులను చెదరగొట్టారు.