ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా డిగ్రీ పట్టా పొందారు. సింగపూర్‌లోని ఓ ప్రముఖ విశ్వవిద్యాలయంలో అన్నా లెజినోవా మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేశారు. శనివారం జరిగిన గ్రాడ్యువేషన్ వేడుకల్లో ఆమె డిగ్రీ పట్టా పొందారు. ఈ వేడుకలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.