ఏపీలోని తిరుపతి జిల్లా నాగలాపురం మండలం రేప్పాలతిప్ప పరిధిలోని అటవీ ప్రాంతంలో టాస్క్‌ఫోర్స్ బలగాల దాడుల్లో భారీగా ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి. 8 మంది స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి సుమారు రూ.20 లక్షల విలువ చేసే 479 కేజీల 69 ఎర్రచందనం దుంగలు, ఒక మోటర్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు టాస్క్‌ఫోర్స్ ఇంఛార్జ్ సుబ్బరాయుడు, ఎస్పీ శ్రీనివాస్ టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో మీడియాకు వివరాలు వెల్లడించారు.