AP: పిఠాపురంలో నిర్వహించిన జయకేతనం సభలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 4 దశాబ్దాల టీడీపీని నిలబెట్టామని పవన్ వ్యాఖ్యానించడాన్ని టీడీపీ శ్రేణులు తప్పుబడుతున్నారు. మీరు ఏది చెప్తే అది నమ్మడానికి జనాలు పిచ్చోళ్లు కాదని విమర్శలు చేస్తున్నారు. అయితే తమ నేత కూటమి ఏర్పాటు ప్రతిపాదనతోనే అధికారంలోకి వచ్చామని జనసైనికులు అంటున్నారు. కాగా, పవన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.