1989 నవంబర్ 13న పశ్చిమబెంగాల్‌లోని రాణిగంజ్‌లోని మహబీర్ కొలియరీ బొగ్గు గనిలో 232 మంది కార్మికులు తవ్వకాలు జరుపుతుండగా ఒక్కసారిగా వరదనీరు ముంచెత్తింది. 161 మంది సురక్షితంగా బయటపడ్డారు. అయితే 65 మంది గనిలో చిక్కుకుపోయారు. ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. కోల్ ఇండియా మైనింగ్ ఇంజినీర్ జశ్వంత్ గిల్ నేతృత్వంలో బోర్‌వెల్ సాయంతో స్టీల్ క్యాప్సూల్‌ని లోపలికి పంపి ఒక్కొక్కరిని బయటకు తీసుకొచ్చారు. దీంతో కథ సుఖాంతమైంది.