SLBC ప్రాజెక్టుకు 1979లోనే అంకురార్పణ జరిగింది. 1982 జూలై 29న రూ.480 కోట్లతో సొరంగ మార్గం పనులు చేపట్టాలని ఉమ్మడి ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. జీఓ విడుదల చేసింది. ఆ తర్వాత 22ఏళ్ల వరకు దాన్ని ఎవరూ పట్టించుకోలేదు. 2005లో వైఎస్ఆర్ ఈ ప్రాజెక్టుకు తిరిగి జీవం పోశారు. 2005 ఆగస్టు 11న పరిపాలన అనుమతులు జారీ చేశారు. 2006లో సొరంగం పనులకు శంకుస్థాపన జరిగింది. 2026లో పూర్తి చేయాలన్నది కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.