ఏపీలో రోడ్ల పరిస్థితులపై సీఎం చంద్రబాబు అధికారులపై సీరియస్ అయ్యారు
. 'రాష్ట్రంలో రోడ్లపై ఎక్కడా గుంతలు కనిపించకూడదు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే పాత చంద్రబాబును చూడాల్సి వస్తుంది. సస్పెండ్ చేయడానికి వెనకాడను. రెండు నెలల్లో యుద్ధప్రాతిపదికన గుంతలన్నీ పూడ్చాలి. లేకపోతే చర్యలు తప్పవు' అని అధికారులను హెచ్చరించారు. గుంతలమయమైన 7,087 కి.మీ మేర రహదారుల మరమ్మతులకు రూ.290 కోట్లు, వరదలతో దెబ్బతిన్న 4,565 కి.మీ రోడ్లకు రూ.186 కోట్లను రాష్ట్ర విపత్తు నివారణ నిధి నుంచి విడుదల చేయాలని ఆదేశించారు.