గిద్దలూరు లోని విట్ట కళ్యాణ మండపంలో శనివారం మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి పురస్కరించుకొని మెగా రక్తదార శిబిరాన్ని నిర్వహించారు. రక్తదాన శిబిరాన్ని స్థానిక ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ప్రారంభించారు. కూటమి నాయకులు కార్యకర్తలు ఈ రక్తదార శిబిరంలో భారీగా పాల్గొని రక్తదానం చేశారు. ఎన్టీఆర్ పేదలకు అందించిన సంక్షేమ పథకాలే వారి గుండెల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారని అశోక్ రెడ్డి అన్నారు.