గిద్దలూరు: కాశీనాయన కుంటను పరిశీలించిన సబ్ కలెక్టర్

75చూసినవారు
గిద్దలూరు: కాశీనాయన కుంటను పరిశీలించిన సబ్ కలెక్టర్
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని కాశీనాయన కుంటను మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట్ త్రివినాగ్ మంగళవారం పరిశీలించారు. కొంతమంది వ్యక్తులు కుంట పరిసర ప్రాంతాలను కబ్జా చేశారని కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాలతో కాశీనాయన కుంటను సర్వే చేసి నివేదికను కలెక్టర్ కు అందిస్తామని సబ్ కలెక్టర్ వెంకట్ త్రివినాగ్ తెలిపారు. కుంటలో ఆక్రమణలు జరిగినట్లుగా అధికారులు నివేదిక తయారు చేశారు.

సంబంధిత పోస్ట్