గిద్దలూరు: యువకుడు ఆత్మహత్యాయత్నం

54చూసినవారు
గిద్దలూరు: యువకుడు ఆత్మహత్యాయత్నం
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని నల్లబండ బజారుకు చెందిన ఓ యువకుడు ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గుర్తించిన బంధువులు హుటాహుటిన యువకుడిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువకుడు ఆత్మహత్యకు యత్నించినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రేమ వ్యవహారంలోనే యువకుడు ఆత్మహత్యకు యత్నించినట్లుగా పోలీసుల విచారణలో తేలింది.