కనిగిరి: ప్రభుత్వ మద్యం దుకాణాన్ని తనిఖీ చేసిన సీఐ

70చూసినవారు
కనిగిరి పట్టణంలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో మిగిలి ఉన్న స్టాక్ ను ఎక్సైజ్ సీఐ విజయభాస్కర్ బుధవారం తనిఖీ చేశారు. పామూరు రోడ్డులోని పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న ప్రభుత్వం మద్యం దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన సీఐ షాపులోని స్టాక్ ను, పరికరాలను రెవెన్యూ అధికారులతో కలిసి పంచనామా నిర్వహించారు. దుకాణంలోని స్టాక్ ను మార్కాపురంలోని గోడౌన్ కు తరలిస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్