వెలుగొండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కనిగిరిలోని ఆర్డీవో కార్యాలయం వద్ద సోమవారం సిపిఐ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆయన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్టుకు రూ. 2, 000 కోట్లు నిధులను కేటాయించి ప్రాజెక్టును పూర్తి చేయాలన్నారు. నిర్వాసితులకు ఆర్ఆర్ ప్యాకేజీ తక్షణం ఇవ్వాలని తెలిపారు.