ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ప్రభుత్వ స్తలం కోసం రెండు వర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. పాకల రోడ్డులో ప్రభుత్వ స్థలం ఉండగా అక్కడ గతంలో ఒకరు చికెన్ షాపు నిర్వహించారు. ఆ స్థలం ప్రస్తుతం ఖాళీగా ఉండటం గమనించిన కొందరు అక్రమించి శుక్రవారం ఇల్లు కట్టే ప్రయత్నం మొదలు పెట్టారు. విషయం తెలుసుకున్న పాత అక్రమనదారుడు అక్కడికి వచ్చి నిర్మాణాన్ని అడ్డుకున్నాడు. దీంతో ఇరువర్గాలు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.