తర్లుపాడు ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం జరిగిన సర్వసభ సమావేశం రసాభసాగా మారింది. పంచాయతీల అభివృద్ధికి ఖర్చుపెట్టిన నగదు సంబంధిత బిల్లులను విడుదల చేయకపోవడంపై.. సర్పంచ్ లుచ ఎంపీటీసీలుచ ఎంపీడీవోచ ఎంపీపీ ఛాంబర్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మూడు నెలల క్రితం బిల్లులు విడుదల చేసిన తమకు చెల్లించలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే తమ బిల్లులు చెల్లించాలని సర్వసభ సమావేశాన్ని బహిష్కరించారు.