ఒంగోలులో ఈనెల 6వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లుగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు తెలిపారు. ఒంగోలులోని టిడిపి కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఒంగోలు లోని ఏ1 ఫంక్షన్ హాల్ లో జాబ్ మేళా నిర్వహిస్తున్నామని నియోజకవర్గంలోని యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో నిర్వహిస్తున్నామన్నారు. వెయ్యి మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.