ఎస్ఎన్ పాడు: పేకాట శిబిరంపై దాడి.. 9 మంది అరెస్ట్

51చూసినవారు
ఎస్ఎన్ పాడు: పేకాట శిబిరంపై దాడి.. 9 మంది అరెస్ట్
పేకాట శిబిరంపై దాడి చేసి 9 మంది జూదరులను అరెస్టు చేసినట్లుగా స్థానిక ఎస్సై అజయ్ బాబు తెలిపారు. సంతనూతలపాడు మండలంలోని మద్దలూరు గ్రామంలో ఆదివారం పేకాట ఆడుతున్నట్లుగా సమాచారం అందుకున్న ఎస్సై అజయ్ బాబు తన సిబ్బందితో కలిసి దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా 9 మందిని అరెస్టు చేసి రూ. 8,390 నగదును స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. వీరిని కోర్టులో హాజరు పరుస్తున్నట్లుగా పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్