

చీమకుర్తిలో టీడీపీ ప్రభ తరలింపు
చీమకుర్తి మండలం రామతీర్థం గంగమ్మ తల్లి జాతర ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా చీమకుర్తి పట్టణ టిడిపి ఆధ్వర్యంలో 110 అడుగుల భారీ ప్రభ నిర్మాణం జరిగింది. ఈ ప్రభను గురువారం భారీ ఊరేగింపు మధ్య రామతీర్థం గంగమ్మ తల్లి పుణ్యక్షేత్రంనకు తరలించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టిడిపి నాయకులు, అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు.