సినిమా సీన్ తలపించే విధంగా చోరీ జరిగింది. గురువారం దోర్నాలలోని ఓ బజార్ లోకి ఇద్దరు యువకులు పక్కా ప్లాన్ వేసి మరి బైకుపై వచ్చారు. ముందుగా ఓ యువకుడు బైక్ పడిపోతున్నట్లు యాక్టింగ్ చేశాడు. అటుగా వెళ్తున్న దాసయ్య ఆ యువకుడికి సాయం చేసేందుకు వచ్చాడు. అదే సమయంలో మరో యువకుడు వేగంగా వచ్చి దాసయ్య చొక్కా జేబులోని స్మార్ట్ ఫోన్ ను కొట్టేశాడు. తర్వాత ఇద్దరూ బైక్ పై పారిపోయారు. బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.