పెద్దారవీడు మండల సర్వసభ్య సమావేశాన్ని మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ బెజవాడ పెద్ద గురవయ్య అధ్యక్షత నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో రాజ్ కుమార్ నాయక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎర్రగొండపాలెం నియోజకవర్గ శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు. మండల ప్రజా ప్రతినిధులు ఎంపీటీసీలు, సర్పంచులు జడ్పిటిసిలు, అధికారులు హాజరుకావాలని కోరారు.