ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలోని భవిత కేంద్రంలో ఫిజియోథెరపీకి హాజరయ్యే దివ్యాంగ విద్యార్థులకు ప్రభుత్వం ట్రాన్స్ పోర్టు, ఎస్కార్ట్ అలవెన్సు అందిస్తోందని ఎంఈవో కె. తులసి మల్లికార్జున నాయక్, రాజశేఖర్ రెడ్డి తెలిపారు. భవిత కేంద్రంలో సోమవారం జరిగిన ఫిజియోథెరపీ క్యాంపును వారు పరిశీలించారు. ముందుగా బాబు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఫిజియోథెరపిస్టు అంకారావు, ఐఆర్టీలు బాలవిజయ, హుస్సేని పాల్గొన్నారు.