పుల్లలచెరువు మండలం కొమరోలు లో ఓ పూరి గుడిసె దగ్గం అయిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పెద్ద వీరయ్యకు చెందిన ఇంటిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ చేసుకొని మంటలు దావాలంగ వ్యాపించాయి. అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించిన వారు అక్కడికి చేరుకునే లోపు ఇల్లంతా పూర్తిగా కాలిపోయింది. దాదాపు రూ. 2 లక్షల వరకు ఆర్థిక నష్టం జరిగిందని కట్టుబట్టలతో రోడ్డుపై నిలబడ్డామని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తూ తెలిపాడు.