త్రిపురాంతకంలోని అన్నసముద్రంలో ఈశ్వర్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. శుక్రవారం పొలం వద్ద హద్దు రాళ్ళు కూలీలతో పాతిస్తూ ఈశ్వర్ రెడ్డి మంచినీళ్లు తెస్తానని వెళ్ళాడు. గ్రామ శివారులలో గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేయడంతో ఈశ్వర్ రెడ్డి కి తీవ్ర గాయాలయ్యాయి. అతనిని వైద్యం కోసం వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పొలం వివాదం వల్ల దాడి జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.