ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం టిడిపి ఇన్ ఛార్జ్ ఎరిక్షన్ బాబు వరద ముంపుతో వరదల్లో చిక్కుకున్న విజయవాడ నగరంలో చిట్టచివరి బాధితుడికి కూడా ప్రభుత్వ సాయం అందిస్తామని అదే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు బుధవారం విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో వరద పరిస్థితిని ఎరిక్షన్ బాబు పర్యవేక్షించారు. సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్తామన్నారు.