ప్రకాశం జిల్లా, దోర్నాల లో సోమవారం స్థానిక టిడిపి ఇన్ ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు పల్లె పండుగ వారోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించారు. రూ.50లక్షల వ్యయంతో దోర్నాల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గతంలో గొట్టిపాటి రవికుమార్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని ఇన్ ఛార్జ్ ఎరిక్షన్ బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.