దోర్నాల: గుర్తుతెలియని వ్యక్తి మృతి
ప్రకాశం జిల్లా దోర్నాల పట్టణంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన మంగళవారం జరిగింది. స్థానిక హోటల్ వద్ద ఓ వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉన్న విషయాన్ని గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు వివరాలు తెలియవలసి ఉందని విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని దోర్నాల ఎస్ఐ మహేష్ తెలిపారు.