యర్రగొండపాలెం: 17న రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి పర్యటన
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ అక్టోబర్ 17వ తేదీన పర్యటించునున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో అభివృద్ధి పనులను ఆరోగ్యశాఖ మంత్రి ప్రారంభించనున్నారు. మంత్రి పర్యటన ఏర్పాట్లు సందర్భంగా స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. స్థానిక ఆసుపత్రులలో పేదలకు మెరుగైన వైద్యం అందేలా చూడాలంటూ ప్రజా సంఘాలు ఆయనను కలవనున్నాయి.