Sep 14, 2024, 12:09 IST/
సొంత డబ్భులతో బ్రిడ్జి నిర్మాణం చేసిన రైతు
Sep 14, 2024, 12:09 IST
మెదక్ జిల్లా టెక్మాల్ మండలం బొడ్మాట్ పల్లి నుండి పలు గ్రామాల మీదుగా గుండువాగు ప్రవహిస్తుంది. దీంతో వానాకాలం వచ్చిందంటే వాగు వెంట ఉన్న తమ పొలాలకు వెళ్లాడానికి రైతులు మినీ యుద్దమే చేయాలి. అక్కడ వంతెన నిర్మాణానికి పాలకులకు విన్నవించినా ఫలితం లేకపోయింది. దీంతో రైతే ఇంజనీర్‌గా మారి వంతెన కలను సాధ్యం చేశారు. టెక్మాల్కు చెందిన రైతు కమ్మరి రాములు రెండు లక్షల రూపాయలతో వాగుపై వంతెనను నిర్మించారు. అదే ప్రాంతానికి చెందిన ప్రభాకర్ శర్మ రాములుకు 30 వేల రూపాయలు సహకారం అందించారు.