ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఇవాళ టెక్కలిలో పర్యటించారు. టెక్కలి జిల్లా ఆస్పత్రికి సందర్శించి ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో లిఫ్ట్ పని చేయట్లేదని తెలుసుకొని, తక్షణమే లిఫ్ట్ రిఫేర్ చేయాలని అధికారులకు ఆదేశించారు. ఆస్పత్రి వెనుక భాగంలో మార్చరీ నిర్మాణంతో పాటు బయోవేస్టేజ్ కేంద్రం ఏర్పాటు చేసేందుకు తగు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.