పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేడు అనూహ్యంగా కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్న జూనియర్ వైద్యుల వద్దకు వెళ్ళి వారిని తిరిగి విధుల్లోకి చేరాలని కోరారు. "నేను ఇక్కడికి ముఖ్యమంత్రిగా రాలేదు.. మీ సోదరిగా వచ్చా. దయచేసి.. తిరిగి మీ విధుల్లోకి చేరండి, నేను మీపై ఎలాంటి చర్యలు తీసుకోను. మీరు చాలా పని చేస్తారని తెలుసు. మీరు ఎంత ముఖ్యమైన వారో కూడా తెలుసు” అని మమత అన్నారు.