బాపట్ల సబ్ డివిజన్ పరిధిలో నేరాల నియంత్రణకు ప్రత్యేక కార్యచరణతో ముందుకు వెళ్తామని బాపట్ల డిఎస్పి రామాంజనేయులు ఆదివారం మీడియా కి చెప్పారు. ప్రధానంగా గంజాయి పై దృష్టి సారిస్తున్నామని గంజాయి విక్రయాలు చేసిన, కొనుగోలు చేసినట్లు తమకు సమాచారం ఉన్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. మహిళలపై హింసకు పాల్పడే వారిని, ఈవ్ టీజర్ల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని, కాలేజీల వద్ద నిఘాపెడతామని డీఎస్పీ చెప్పారు.