Feb 13, 2025, 17:02 IST/
రాహుల్ గాంధీకి లక్నో కోర్టు సమన్లు
Feb 13, 2025, 17:02 IST
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీకి లక్నో కోర్టు సమన్లు జారీ చేసింది. తన భారత్ జోడో యాత్రలో భాగంగా 2022లో ఆర్మీపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై న్యాయస్థానం ఈ చర్యకు దిగింది. ఈ కేసు తదుపరి విచారణను అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేటు అలోక్ వర్మ వచ్చే నెల 24కు నిర్ణయించారు. దీనికి రాహుల్ హాజరు కావాల్సి ఉంటుంది. లాయర్ వివేక్ తివారీ.. రాహుల్‌పై పరువు నష్టం దావా వేశారు.