బైక్‌ను ఢీకొట్టిన కారు.. తృటిలో తప్పిన ప్రమాదం (వీడియో)

64చూసినవారు
కేరళలోని కోజికోడ్ సమీపంలో శుక్రవారం సాయంత్రం ఊహించని ప్రమాదం జరిగింది. కొడువల్లి ప్రాంతంలో బైక్‌పై వెళ్తున్న మియాజ్ అనే యువకుడిని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. బాధితుడు రోడ్డుపై పడిపోయాడు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న లారీ డ్రైవర్ సకాలంలో స్పందించి బ్రేకులు వేశాడు. దీంతో మియాజ్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. గాయాలపాలైన మియాజ్‌ను స్థానికులు హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్