కరోనా మళ్ళీ వ్యాపిస్తున్నట్లు హెచ్చరికలందుతున్న నేపథ్యంలో టిడిపి ముందు జాగ్రత్త అనే కార్యక్రమాన్ని మంగళవారం చేపట్టింది. ఇందులో భాగంగా చీరాల నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి కొండయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఈపూరుపాలెం గ్రామంలో ఆ పార్టీ నేతలు శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చీరాల మండల పార్టీ అధ్యక్షుడు పురుషోత్తం చెప్పారు. పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి.