దనకొండ మండలంలోని రుద్ర సముద్రానికి చెందిన యువకుడు అనుమానాస్పద స్థితిలో ఆదివారం మృతి చెందాడు. రుద్ర సముద్రానికి చెందిన చిలకల లింగబాబు(33) ఆదివారం సాయంత్రం ఇంటినుంచి బయటికి వెళ్లాడు.సాయంత్రం వరకు తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్లి చూడగా చెట్టుకు వేళ్లాడుతూ..విగత జీవిగా కనిపించాడు.వెంటనే కిందకు దించి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. అయితే ఎవరైనా యువకుడిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించి ఉంటారని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.