
కనిగిరి: ప్రభుత్వం మద్యంతర భృతిని చెల్లించాలి
కనిగిరి పట్టణంలోని ఏపీటీఎఫ్ కార్యాలయంలో ఆదివారం జోనల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు జనార్దన్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే పిఆర్సి కమిషన్ ను నియమించి 30 శాతం మధ్యంతర భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఏపీటిఎఫ్ విశేష కృషి చేస్తుందని తెలిపారు.