ప్రకాశం జిల్లా, రాచర్ల మండలం, చెర్లోపల్లి గ్రామ సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు ద్విచక్ర వాహనం ఢీకొన్న సంఘటనలో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు బేస్తవారిపేట మండలం మోక్షగుండం గ్రామానికి చెందిన గురువయ్య(60)గా పోలీసులు గుర్తించారు. జరిగిన రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని రాచర్ల పోలీసులు వెల్లడించారు.