వైద్యం కోసం ఆర్థిక సహాయం

60చూసినవారు
వైద్యం కోసం ఆర్థిక సహాయం
ప్రకాశం జిల్లా కంభం మండలం చిన్న కంభం గ్రామానికి చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో బాధపడుతూ హైదరాబాదులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. ఆర్థిక సహాయం కోసం కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం నుంచి మంజూరైన రెండు లక్షల రూపాయల చెక్కును ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి శనివారం సత్యనారాయణ కుటుంబ సభ్యులకు అందజేశారు.

సంబంధిత పోస్ట్