ప్రకాశం జిల్లా కంభంలో ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత పోస్ట్ పెట్టిన వైసిపి కార్యకర్తపై స్థానిక ఎస్సై నరసింహారావు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఆదివారం శివారెడ్డి అనే వైసీపీ కార్యకర్త ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత పోస్టు పెట్టినట్లుగా కంభం టిడిపి నాయకులు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ నరసింహారావు ప్రజలను హెచ్చరించారు.