Sep 23, 2024, 08:09 IST/
10 మంది ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు
Sep 23, 2024, 08:09 IST
తెలంగాణలో ఇటీవల పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. పదవికి రాజీనామా చేయకుండా పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ.పాల్ వేసిన పిటిషన్ ను కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నేపథ్యంలోనే ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.