భారతదేశంలో ఎలక్ట్రానిక్ తయారీని భారీగా పెంచే లక్ష్యంతో కార్మిక చట్టాల సంస్కరణలు తీసుకురావడానికి ప్రభుత్వం కార్మిక మంత్రిత్వ శాఖతో చర్చలు నిర్వహిస్తోందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ చట్టాలు రాష్ట్రాల పరిధిలో కూడా ఉండటంతో, వివిధ రాష్ట్రాలతో సంప్రదింపులు జరుగుతున్నాయని అన్నారు. కొన్ని రాష్ట్రాలు తగిన మార్పులు చేయడానికి అంగీకరించాయని మంత్రి తెలిపారు.