ఉగాది అంటే తెలుగువారి పండుగ. హిందువులంతా ఈ రోజు ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణం చేస్తారు. కానీ ముస్లింలు పూజలు చేయడం ఎప్పుడైనా చూశారా..?. కడప నగరంలోని దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఉగాది పర్వదినాన ముస్లింల ప్రత్యేక పూజలు చేస్తున్నారు. బీబీ నాంచారమ్మ తమ ఇంటి ఆడబిడ్డ అని, వేంకటేశ్వర స్వామి తమ ఇంటి అల్లుడు అంటూ తరతరాలుగా ముస్లింలు ఈ పద్ధతిని ఆచరిస్తున్నారు.